News April 17, 2025

శంఖవరం: చెప్పులు దండ వేసిన నిందితుడు అరెస్ట్

image

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.నిందితుడి పేరు పడాల వాసు(20) అని అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు,10మంది ఎస్సైలు ,40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ వారిని అభినందించారు.

Similar News

News December 18, 2025

రూపాయికే ఇంటర్నెట్ ప్యాక్: ‘డబ్బా’ నెట్‌వర్క్

image

‘PM వాణి’ అమలులో భాగంగా రూపాయి నుంచి ఇంటర్నెట్ ప్యాక్‌లు అందిస్తున్నట్లు బెంగళూరు సంస్థ ‘డబ్బా’ నెట్‌వర్క్ తెలిపింది. తమ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. PM వాణి పథకం ద్వారా ఎవరైనా తమ ఏరియాలో వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ పంపిణీదారుగా మారొచ్చు. డేటా ప్యాక్‌ల ద్వారా వైఫై అందిస్తారు. డబ్బా నెట్‌వర్క్ ఏడాదిలో 73,128 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటుచేసింది.

News December 18, 2025

సిద్దిపేట: ఒక్క ఓటుతో గెలుపు.. రికౌంటింగ్‌

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు కర్రోళ్ల నాగరాజు, కొయ్యడ వెంకటేశం మధ్య ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశం సమీప ప్రత్యర్థి పై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

News December 18, 2025

భారీ జీతంతో OICLలో 300 జాబ్స్

image

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్స్ నిర్వహిస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.250. వెబ్‌సైట్: orientalinsurance.org.in/