News April 17, 2025
శంఖవరం: చెప్పుల దండ వేసిన నిందితుడి అరెస్ట్

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. నిందితుడి పేరు పడాల వాసు (20) అని, అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ అన్నారు. అనంతరం వారిని అభినందించారు.
Similar News
News December 18, 2025
మహబూబాబాద్‌లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్‌తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.
News December 18, 2025
JNTUHకు నిధులు కావాలని సీఎంకు లేఖలు! కానీ..

JNTUHలో పరిపాలన విషయంలో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీకి తెలియకుండా ఓ డైరెక్టర్ ఏకంగా సీఎంకు యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కావాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కనీసం వర్సిటీ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలు పాటించకుండా ఈ వ్యవహారం జరిగిందని వర్సిటీలో పలువురు చర్చిస్తున్నారు. దీనిపైన యూనివర్సిటీ యంత్రాంగం ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.


