News January 27, 2025
శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News October 19, 2025
యాడికి: 11 మందిపై కేసు నమోదు

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించింది. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, బాధితులు శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.
News October 19, 2025
సూపర్ GST కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, MLA

పుట్టపర్తిలో APSPDCL, జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ GST – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో MLA పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రైతులు వినియోగించే డ్రిప్పు, స్పింకులర్లపై కేంద్రం 18 నుంచి 12% GST తగ్గించిందని కలెక్టర్ తెలిపారు. PM సూర్య ఘర్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్‌పై రూ.10,000 తగ్గించిందన్నారు. ప్రజలు దీనిని గమనించాలన్నారు.
News October 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 19, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.