News December 20, 2024

శంబర పోలమాంబను ఒకటే కోరుకున్నా: పవన్ కళ్యాణ్

image

మక్కువ మండలం బాగుజోలలో గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శంబర పోలమాంబను తలచుకున్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించే శక్తిని తనకు ఇవ్వాలని శంబర పోలమాంబను వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సవర కళాకారులు వేసిన పెయింటింగ్స్‌ని భుజంపై పట్టుకుని మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గర్వంగా సవర కళ గురించి చెప్పినట్లు వెల్లడించారు. వాడుక భాష నేర్పించిన నేల ఉత్తరాంధ్ర అని ఆయన అన్నారు.

Similar News

News January 16, 2025

VZM:ర‌హ‌దారి నిబంధ‌న‌ల‌ను పాటించాలి:కలెక్టర్

image

ర‌హ‌దారిపై ప్ర‌యాణించేట‌ప్పుడు ప్ర‌తీఒక్క‌రూ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌ను క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడ‌ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు. అజాగ్రత్త‌గా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్లే 90 శాతం ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.

News January 16, 2025

సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి

image

సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

News January 16, 2025

వేపాడ: ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి.. వ్యక్తి మృతి

image

వేపాడ మండలం కృష్ణరాయుడుపేటలో బుధవారం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల పరుగు ప్రదర్శనలో ఒక బండి అదుపు తప్పి కల్లాల వైపు వెళ్లింది. బి.దేముడు(48)పైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ దేవికి చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.