News April 10, 2025

శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

image

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.

Similar News

News April 17, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం RTO కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద రూ.25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనన్నారు.

News April 17, 2026

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

News April 17, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో సహాయం చేసిన వారికి రాహవీర్ పథకం కింద రూ.25 వేలు బహుమతి అందిస్తామని చెప్పారు. 30 బ్లాక్ స్పాట్ల సరిదిద్దడంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ఏఐ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.