News May 3, 2024
శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

HYD శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.
Similar News
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
News November 19, 2025
ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.