News April 28, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత కలకలం?
HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారని, ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2024
RR: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి!
సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ మొత్తం కలిపి 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వేలో ఫొటోలు తీయడం, పత్రాలు అడగం వంటివి చేయరు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
News November 5, 2024
HYD: మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సులు
HYDలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలోని ఎంబీ భవన్‌లో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ వాదులతో సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని తీర్మానించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని, బీజేపీ, RSS దేశంలో మతోన్మాదంతో విధ్వంసానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
News November 5, 2024
HYD: ALERT ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. బైక్ నడిపే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దీనికి నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. 3 రోజులుగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారని, ఇందుకు హెల్మెట్ లేకపోవడమే కారణమని సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వ ప్రసాద్ తెలిపారు. హెల్మెట్ లేకపోతే రూ.200, రాంగ్ రూట్లో వెళితే రూ.2వేలు చలానా విధిస్తామన్నారు.