News May 10, 2024

శంషాబాద్: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

image

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశీయంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన 3 విమానాలు, వారణాసి, విజయవాడ, గ్వాలియర్, సూరత్, లక్నో, బెంగళూరు, గోవా, కొచ్చిన్, పుణేకు వెళ్లాల్సిన 12 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Similar News

News October 10, 2024

HYD: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన RTC ఎండీ

image

తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.

News October 10, 2024

HYD: హైడ్రా పవర్స్.. పూర్తి వివరాలు!

image

ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.

News October 10, 2024

HYD: మూసీలో తగ్గుతోన్న ఆక్సిజన్!

image

HYD మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయి రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో రసాయనాల స్థాయి పెరుగుతుందని CPCB తెలిపింది. నీటిలో కరిగే ఆక్సిజన్(DO) CPCB ప్రకారం లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాములు ఉండాలి. కానీ, గండిపేట-6, బాపూ‌ఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లిలో 0.3 మాత్రమే ఉండటం ఆందోళనకరం. దీంతో మూసీలో జలచరాలు బతకడం కష్టమే.