News February 18, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

Similar News

News February 24, 2026

చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

image

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

తూ.గో: కల్తీ పాలు తాగిన మరొకరి మృతి

image

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారని కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి తెలిపారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.

News February 24, 2026

ఇళ్లకు తలుపులు లేకపోయినా దొంగలే పడరు!

image

మహారాష్ట్రలోని శని శింగణాపూర్ ఒక వింతైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ గ్రామంలో ఇళ్లు, దుకాణాలు, చివరకు బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. తమను శని దేవుడు నిరంతరం రక్షిస్తాడని, తప్పు చేస్తే దైవశిక్ష తప్పదని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే వందల ఏళ్లుగా తలుపులు లేకపోయినా దొంగతనాలు జరగలేదు. ఇలాంటి ఆశ్చర్యకర విషయాలను ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. మీకు తెలిసిన వింతైన ప్రదేశాలనూ తెలపవచ్చు.