News May 24, 2024
శంషాబాద్: రన్నింగ్ విమానం తలుపు తీసేందుకు యత్నం

గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్‌పై కేసు నమోదు చేశారు.
Similar News
News November 20, 2025
HYD: మంత్రి శ్రీహరిని కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని చిన్న శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు.
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్‌తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.
News November 20, 2025
వజ్రోత్సవం వేళ.. JNTUపై వరాలు కురిపించేనా?

జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించేంచనున్నారు. 21న వజ్రోత్సవం, 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగనుంది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కళాశాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అని అధ్యాపకులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రాకతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


