News April 15, 2025
శంషాబాద్: విమానంలో ప్రాణాలు కాపాడిన డాక్టర్

విమానంలో అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని డాక్టర్ కాపాడారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డా.ప్రీతిరెడ్డి ఇది గమనించారు. వెంటనే అతడికి CPR చేశారు. స్పృహలోకి రావడంతో గమ్యస్థానానికి చేర్చారు. డాక్టర్ ప్రీతిరెడ్డి చొరవ పట్ల ఇతర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ డాక్టర్ ఎవరో కాదు మన మేడ్చల్ MLA మల్లారెడ్డి కోడలే.
Similar News
News December 9, 2025
మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.
News December 9, 2025
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
News December 9, 2025
VZM: మహిళల కోసం ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనం

విజయనగరం కలెక్టరేట్‌లో మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీస్, చట్ట సహాయం, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు తెలిపారు. 24/7 పనిచేసే ఈ వాహనాలు టోల్ ఫ్రీ నంబర్ 181 ద్వారా మహిళలకు అందుబాటులో ఉంటాయన్నారు.


