News March 15, 2025
శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించండి: ఎస్పీ

మహిళలు, అమ్మాయిల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన చేయాలని పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌కు ఎస్పీ జగదీశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ తమ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించవచ్చన్నారు.
Similar News
News April 16, 2026
గ్రామగ్రామాన సీఎం బర్త్ డే వేడుకలు: పూల నాగరాజు

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈనెల 20న గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: అనంతపురం జిల్లాకు 15వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు <<19653702>>సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 21,730 మందికి 15,814 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 20,320 మంది పరీక్షలు రాయగా 15,530 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది.