News March 8, 2025
శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ఆన్లైన్ శిక్షణ: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు పెంపొందించడానికి ప్రభుత్వం కర్మయోగి పోర్టల్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్ నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 16 లోగా ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు అంతా మూడు అంశాలపై శిక్షణ పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News September 14, 2025
కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.
News September 14, 2025
MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

జాతీయ మెగా లోక్ అదాలత్లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597
News September 14, 2025
మొటిమలకు ఇవే కారణాలు..

అమ్మాయిలను మొటిమలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటికి ఎన్నో కారణాలుంటాయి. రాత్రిళ్లు కార్టిసాల్ స్థాయులు తగ్గి, కొల్లాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్ చేస్తుంది. మేకప్ తీయకుండా నిద్రపోతే చర్మరంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండి మొటిమలొస్తాయి. పిల్లోకవర్స్ ఉతక్కపోయినా చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియా, మృతకణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలకు నూనె రాసుకొని పడుకుంటే అది సీబమ్ ఉత్పత్తిని పెంచుతుంది.