News February 26, 2025
శతశాతం ఈ-పంట నమోదు చేయాలి: కలెక్టర్

జిల్లాలో శత శాతం ఈ-పంట నందు నమోదు చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఈ-పంట నమోదుపై మండలాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం నమోదు పూర్తయిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి శతశాతం పూర్తిచేయాలని సూచించారు.
Similar News
News February 26, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
News February 26, 2025
ఉద్యోగుల రాజీనామా.. మస్క్ దూకుడుకు బ్రేక్?

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌కు చెందిన 21మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో తాము భాగస్వామ్యం కాలేమని తెలిపారు. డోజ్‌లో రాజకీయ ఉద్దేశ్యాలున్న వారే అధికంగా ఉన్నారని వారికి ఉద్యోగం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు లేవని ఆరోపించారు. ఈ రాజీనామాలతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్, ట్రంప్ ద్వయానికి షాక్ తగిలిందని అంతా భావిస్తున్నారు.
News February 26, 2025
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు: డీఎంహెచ్‌వో

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్‌సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్‌కు పంపాలన్నారు.