News July 3, 2024
శతాధిక గిరిజనుడిని ఎత్తుకున్న అల్లూరి కలెక్టర్ దినేష్

అల్లూరి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.
Similar News
News October 19, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
News October 19, 2025
నన్నయ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు.. ఎప్పుడంటే..!

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో డిసెంబరు 5, 6 తేదీల్లో ‘పర్యావరణ స్థిరత్వం’ (Environmental Sustainability) అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆవిష్కరించారు. దేశ విదేశాల నుంచి శాస్త్ర, సాంకేతిక రంగ నిపుణులు వక్తలుగా హాజరవుతారన్నారు. పరిశోధన పత్రాలు నవంబరు 24లోపు సమర్పించాలని కోరారు.
News October 18, 2025
రేపు రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్: కలెక్టర్

వాణిజ్య, వ్యాపార రంగాలకు నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ‘ది గ్రేట్ రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలో తెలిపారు. ఈ నెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆనంద్ రీజెన్సీ సమీపంలోని పందిరి ఫంక్షన్ హాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్పై అవగాహన పెంచడం, వ్యాపారంలో ఉత్సాహం నింపడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.