News June 7, 2024

శతాబ్ది ఉత్సవాలకు గంధర్వ మహల్ ముస్తాబు

image

ఆచంటలోని గంధర్వ మహల్‎ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‎టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్‎లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.

Similar News

News December 10, 2024

వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు: కారుమూరి

image

తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉమ్మడి ప.గో.జిల్లా నియోజకవర్గ ఇన్చార్జీలు, ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు.

News December 10, 2024

భీమవరం: జాయింట్ కలెక్టర్ ఆగ్రహం

image

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్‌ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులోని ఓ పూల దుకాణం వద్దకు ఆయన వచ్చారు. పూలను ప్లాస్టిక్ కవర్స్‌లో ఇస్తుండటంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నారని గట్టిగా నిలదీశారు.

News December 10, 2024

ప.గో: నిధుల దుర్వినియోగం.. క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

యలమంచిలి మండలం చించినాడ పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీ జయరాజు రూ.14,94,224, ముత్యాలపల్లి సెక్రటరీ కృష్ణంరాజు రూ.1,99,50,956, చినఅమిరం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సుమనాగ్ రూ.15,98,455 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ నాగరాణి సోమవారం తెలిపారు. వీరిపై క్రిమినల్ చర్యల నిమిత్తం భీమవరం తాహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. నిధులు మళ్లింపుకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.