News January 31, 2025

శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

image

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్‌ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 KV బల్క్‌ లోడ్‌ ఫీడర్‌ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌లోని కోదండాపూర్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.

Similar News

News November 17, 2025

అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

image

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.

News November 17, 2025

మెదక్: పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.1, సదాశివపేట 7.9, న్యాల్కల్ 8.0, మెదక్ జిల్లా నర్లాపూర్, సర్ధాన, వాడి 9.3, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డి పేట 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 17, 2025

సూర్యాపేట: భార్యను రోకలిబండతో బాది హత్య

image

మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారింగుల వెంకన్న అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పద్మ(40)ను రోకలి బండతో బాది హత్య చేశాడు. ఆవేశానికి లోనైన వెంకన్న బలంగా తలపై కొట్టడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మోతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.