News January 31, 2025
శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 KV బల్క్ లోడ్ ఫీడర్ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌లోని కోదండాపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.
Similar News
News February 16, 2025
మీ ఫోన్‌లో రేడియోషన్ ఎంతో తెలుసుకోండి

మనం వాడే మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుంది. అయితే మన ఫోన్ ఎంత రేడియోషన్ విడుదల చేస్తుందనేది తెలియకపోవచ్చు. దీనిని SAR(స్పెసిఫిక్ అబ్జార్‌ప్షన్ రేటు) ద్వారా నిర్ణయించవచ్చు. మీ ఫోన్ డయల్ పాడ్‌లో *#07# ను ఎంటర్ చేయడం ద్వారా ఈ SAR తెలుసుకోవచ్చు. మన దేశంలో మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే SAR లిమిట్ 1.6W/kg వరకు ఉంది.
ShareIt
News February 16, 2025
రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని స్కూళ్లకు విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు, నల్గొండ జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇస్తూ ఆయా కలెక్టర్లు ప్రకటన చేశారు. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పేరు గాంచిన పెద్దగట్టు జాతరకు 25 లక్షల మందికి పైగా భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తారు.
News February 16, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ శంకరపట్నం మండలంలో చికిత్స పొందుతూ యువరైతు మృతి ✓ మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు✓ కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ధర్మపురికి చెందిన మహిళా మృతి✓ జగిత్యాల పట్టణంలో ప్రముఖ చిత్రకారుడు మచ్చ రవి గుండెపోటుతో మృతి✓ జగిత్యాల: ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషయం✓ ఇల్లంతకుంట మండలంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు