News October 26, 2024
శని, ఆదివారాల్లో సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
దానా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం సికింద్రబాద్ నుంచి వచ్చే(12710) రైలు రద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రబాద్ వెళ్లే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News November 4, 2024
పంచాయతీ సెక్రటరీ లైంగిక వేధింపులపై నెల్లూరు SPకి ఫిర్యాదు
లైంగికంగా వేధిస్తున్నాడని పంచాయతీ సెక్రటరీపై ఓ గిరిజన మహిళ SPకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాల ప్రకారం.. రాపూరు పంచాయతీలోని కోడూరుపాడుకు చెందిన ఓ గిరిజన మహిళ తన తండ్రి చనిపోవడంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ చెంచయ్యను కోరింది. ఆయితే ఆయన తనతో వీడియో కాల్ మాట్లాడాలని, తన కోరిక తీర్చితే డెత్ సర్టిఫికెట్ 5 నిమిషాల్లో ఇస్తానని వేధించాడని చెప్పింది. సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
News November 4, 2024
నెల్లూరు: బాలిరెడ్డిపాలెంలో విషాదం.. బాలుడు మృతి
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బాలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన చరణ్(14)ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు బాలుడిని బాలిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి మూసేసి ఉంది. గూడూరుకి తరలించేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో వైద్యం అందుంటే బతికుండేవాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
News November 4, 2024
వెంకటగిరి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
బాలాయపల్లి మండలంలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మండంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 9వ తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరకున్న చిన్నారి బంధువులను చూసి నిందితుడు పరారయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.