News July 30, 2024

శభాష్ నెల్లూరు పోలీసు.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు లేఖ

image

నెల్లూరు రొట్టెల పండగకు చెన్నైకి చెందిన వృద్ధ దంపతులు వచ్చారు. డబ్బు, ఫోన్లు పోగొట్టుకున్నారు. చెన్నైకి వెళ్లేందుకు ఛార్జీకి డబ్బు కోసం భిక్షాటనకు సిద్ధపడ్డారు. గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ మస్తాన్‌ వృద్ధులకు భోజనం పెట్టి మరో రూ.500 ఇచ్చి చెన్నైకి పంపించారు. జరిగిన విషయాన్ని కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రంజన్‌కు వివరించారు. కుమారుడు జరిగిన విషయం నగదు ఇచ్చి ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు లేఖ రాశారు.

Similar News

News December 16, 2025

నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.

News December 15, 2025

ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి: సుభాష్

image

రాష్ట్రంలోని బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకి వినతిపత్రం సమర్పించారు. భవనాల దుస్థితి, నాసిరక ఆహారం, వార్డెన్ల కొరత, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, గర్ల్స్ హాస్టళ్లలో భద్రతా లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

News December 15, 2025

కాకాణి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందన

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.