News March 7, 2025
శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడి మృతి

వైసీపీ సీనియర్ నేత, కొయ్యూరు మండలం శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు లోకుల సోమగాంధీ శుక్రవారం ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మరణించారని కుటుంబీకులు తెలిపారు. శరభన్నపాలెం గ్రామానికి చెందిన సోమ గాంధీ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News November 6, 2025
పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.
News November 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 6, 2025
ఈనెల 27న సింగపూర్‌కు బెస్ట్ టీచర్లు: లోకేశ్

AP: 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27న సింగపూర్ పంపే ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ‘విద్యా విధానాలపై అధ్యయనానికి బెస్ట్ టీచర్లను సింగపూర్ పంపిస్తున్నాం. స్టూడెంట్ అసెంబ్లీకి ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్‌కు పెట్టాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగం చేయాలి. రాష్ట్రంలో కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.


