News September 2, 2024

శాంతించిన మున్నేరు.. భారీగా తగ్గిన వరద

image

ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసిన మున్నేరు వరద కాస్త శాంతించింది. నిన్న వాగు సామర్థ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి 36 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో పరీవాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. తాజాగా నీటిమట్టం 23.50 అడుగులకు చేరింది. సుమారు 12 అడుగులు మేర తగ్గింది. 

Similar News

News September 18, 2024

కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి

image

కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.

News September 18, 2024

19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

News September 18, 2024

MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.