News July 18, 2024
శాంతిభద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల వాయిదా

శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేయనుంది.
Similar News
News December 9, 2025
GNT: అధికార పార్టీ ఎమ్మెల్యే.. అసంతృప్తి స్వరం..!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ నిత్యం అధికారులపై ఏదో ఒక రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ దక్కలేదని ఒకసారి, రేషన్ డీలర్లపై మరోసారి కలెక్టర్కి గతంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె కార్యాలయం ముందు గుంతలు పడిన రహదారిని పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గం ఇటు ప్రజల్లో, అటు SMలో హాట్ టాపిక్గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
News December 9, 2025
గుంటూరు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు : DEO

గుంటూరు జిల్లాలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(APTET) ఈ నెల10 నుంచి 21 వరకు 5 కేంద్రాల్లో జరుగుతుందని DEOసీవీ రేణుక తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్ (7996), 5వ మైలు ప్రియదర్శిని (9651), నల్లపాడు క్లే క్యాంపస్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్(30318), పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు కాలేజ్(8891), పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళాకాలేజ్ (1260)లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం, సాయంత్రం పరీక్ష ఉంటుందన్నారు.
News December 9, 2025
GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.


