News July 18, 2024

శాంతిభద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల వాయిదా

image

శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేయనుంది.

Similar News

News December 12, 2024

పేరేచర్ల: భార్యను చూడటానికి వెళ్తూ ప్రమాదం.. మృతి

image

మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35) గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్‌లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

News December 12, 2024

చిలకలూరిపేట: భార్యపై సుత్తితో దాడి.. కేసు నమోదు

image

భార్యపై అనుమానంతో సుత్తితో దాడి చేసిన విషయమై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పసుమర్రు గ్రామానికి చెందిన నాగరాజు అతని భార్య ఆదిలక్ష్మీపై ఈ నెల 10న సుత్తితో తల, ముఖంపై దాడిచేశాడు. బాధితురాలి కుమారుడు గంజి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై జి.అనిల్ కుమార్ తెలిపారు.

News December 11, 2024

కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లి వద్ద కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. వైకుంఠపురం బ్యారేజీ-10 టీఎంసీలు, చోడవరం బ్యారేజీ-4 టీఎంసీలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవి అమరావతి ప్రాంతంలో తాగునీరు&పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడతాయని, అలాగే రివర్ ఫ్రంట్‌ను రూపొందించడంలో కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు.