News June 3, 2024

శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు: అనంత ఎస్పీ

image

కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని అనంత ఎస్పీ గౌతమిశాలి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా చూడాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

Similar News

News October 14, 2025

స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

image

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్‌లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News October 14, 2025

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.

News October 13, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేయించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.