News April 13, 2025
శాంతి భద్రతలపై దృష్టి సారించండి: ఎస్పీ

శాంతిభద్రతలు కాపాడి, నేరాలు జరగకుండా నిరోధించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మదనపల్లె డీఎస్పీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన మహీంద్ర జిల్లా ఎస్పీని కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం పోలీసు శాఖకు చాలా అవసరం అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా నేరాల నియంత్రణపై దృష్టిసారించాలన్నారు
Similar News
News October 16, 2025
ప్రకాశం జిల్లాలో 2 హైవేలు ప్రారంభం.!

కర్నూలు జీఎస్టీ సభ వేదికగా ప్రధాని మోదీ వివిధ పనులను గురువారం ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో ప్రకాశం జిల్లాలో (1) కనిగిరి బైపాస్ (2) సీఎస్‌పురం 2 లైన్ బైపాస్‌లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
News October 16, 2025
MHBD: అక్టోబర్ 23న లక్కీ డ్రా

అక్టోబర్ 23న ఉదయం 11 గం.కు పట్టణంలోని AB ఫంక్షన్ హాల్లో లైసెన్సుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 61 షాపులకు 353 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన ఉందని, రాబోయే 2 రోజుల్లో పెద్ద మొత్తంలో వస్తాయన్నారు.
News October 16, 2025
కోట్ల నాకు బాగా తెలుసు: మోదీ

కర్నూలు పర్యటనలో భాగంగా ఓర్వకల్లు విమానాశ్రయానికి మోదీ వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు వరుసగా పరిచయం చేశారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గురించి ప్రధానికి చెబుతుండగా.. ‘ఈ పెద్ద మనిషి నాకు బాగా తెలుసు. కేంద్ర మంత్రిగా పనిచేశారు కదా?’ అని చంద్రబాబుతో ప్రధాని అన్నారు.