News April 13, 2025
శాంతి భద్రతలపై దృష్టి సారించండి: ఎస్పీ

శాంతిభద్రతలు కాపాడి, నేరాలు జరగకుండా నిరోధించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మదనపల్లె డీఎస్పీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన మహీంద్ర జిల్లా ఎస్పీని కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం పోలీసు శాఖకు చాలా అవసరం అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా నేరాల నియంత్రణపై దృష్టిసారించాలన్నారు
Similar News
News April 20, 2025
జూరాల నుంచి నీటిని విడుదల చేయలేం: వనపర్తి కలెక్టర్

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టు గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయినందున, తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని అన్నారు. కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి జూరాలకు కొంత నీటిని విడుదల చేసే విధంగా చూడాలని మంత్రిని కలెక్టర్ కోరారు.
News April 20, 2025
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

ఖమ్మం: నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క అన్నారు. శనివారం మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1317 మంది రైతుల నుండి రూ.24.66 కోట్ల విలువ గల 10628.760 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు అదనపు కలెక్టర్ మంత్రులకు వివరించారు.
News April 20, 2025
ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.