News March 26, 2025

శాంతి భద్రతల సమీక్షలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శాంతిభద్రతల సమీక్షలో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్నలు ప్రజెంటేషన్ ఇచ్చారు.

Similar News

News November 20, 2025

HYD: రాజకీయాల్లో దిక్సూచి చుక్కా రామయ్య: KTR

image

చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా విద్యానగర్‌లోని ఆయన నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. KTR మాట్లాడుతూ.. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటం, రాజకీయాల్లో దిక్సూచిగా చుక్కా రామయ్య తనదైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు.

News November 20, 2025

ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

image

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్‌ మూవ్‌మెంట్‌ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్‌ చేంజ్‌‌పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్‌ APJ అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డ్, 2020లో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రొడిజీ అవార్డ్‌లు అందుకుంది.

News November 20, 2025

GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనే

image

మీసేవ వాట్సాప్ ద్వారా GHMC పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నట్లు ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి 2025 జూన్ రెండో తేదీ వరకు మరణించిన వారి వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నట్లుగా వినియోగదారులు తెలిపారు. ప్రజలు 80969 58096 నంబర్‌ సర్వీస్‌ను వాట్సాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.