News July 26, 2024
శాఖాంబరి అలంకరణలో పైడితల్లమ్మ
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి పైడితల్లమ్మ చదురుగుడిలో శుక్రవారం వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో.. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Similar News
News October 12, 2024
విజయనగరం: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని విజయనగరం రూరల్ మండలం గోపాలపురం వద్ద అందుబాటులో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. దీంతో జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
News October 11, 2024
సిరిమానోత్సవంపై కలెక్టర్ సమీక్ష
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అన్ని సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో అమ్మవారి పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమ్మవారి సిరిమాను వద్ద పని చేసే సిబ్బంది 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ప్రారంభం అయ్యేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 5 గంటలలోగా జాతర పూర్తవ్వాలన్నారు.
News October 11, 2024
VZM: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ‘1912’
విజయనగరం జిల్లాలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఇంటి వద్ద నుండే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘1912’ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి రైతు యొక్క ఆధార్, పాస్ బుక్, సర్వే నంబర్, ఫామ్ -3, మొబైల్ నంబర్ వివరాలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలపాలన్నారు.