News July 13, 2024
శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 3, 2026
పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యంను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టల్ శాఖ అకౌంట్‌లో జమ చేయకపోవడంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోస్టల్ శాఖ రూ.3.5 లక్షల అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేసింది.
News January 2, 2026
శాతవాహన అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా ఎస్ రమాకాంత్

శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో డాక్టర్ ఎస్.రమాకాంత్ పీజీ & ప్రొఫెషనల్ పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమకయ్యరు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టర్ ఉత్తర్వులు అందజేశారు. రమాకాంత్ ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
News January 2, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.


