News April 8, 2025

శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39మంజూరు పోస్టులకు గాను 16మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Similar News

News October 13, 2025

వర్జ్యం అంటే ఏంటి?

image

వర్జ్యం అనేది విడువదగిన, అశుభ సమయం. దీన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రంలో సుమారు 96 నిమిషాల వర్జ్యం ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు మొదలుపెట్టకూడదు. జాతకంలో గ్రహాలు వర్జ్య కాలంలో ఉంటే ఆ దశలలో ఇబ్బందులు కలుగుతాయి. వర్జ్యంలో దైవారాధన చేయవచ్చు. దానం చేస్తే దోషాలు పోతాయని శాస్త్రం చెబుతోంది.
☞ రోజువారీ వర్జ్యాలు, ముహుర్తాల ఘడియల కోసం <<-se_10009>>పంచాంగం<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 13, 2025

ఈనెల 17వ తేదీన పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 17వ తేదీ శుక్రవారం రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మహేశ్ కుమార్‌తో సమావేశం అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే పర్యటనలో శంకరగుప్తం డ్రైవ్‌ ముంపు ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.

News October 13, 2025

KNR: యూనిసెఫ్‌ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

image

యూనిసెఫ్ సహకారంతో జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15న గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహణ, స్వచ్ఛ హరిత విద్యాలయాల నమోదు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.