News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
ఒంగోలు:17 ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు నోటీసులు

జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. అలాంటి 17 పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో కిరణ్ కుమార్ తుది సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. వీటిలో 14 స్కూళ్లలో 40 మందిలోపు, మూడు స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం 2సార్లు నోటీసులు జారీచేసినా స్కూల్ యాజమాన్యాలు స్పందన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.