News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2026
ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 10, 2026
నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై జాగ్రత్త: SP

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరించారు. Facebook, Instagram, Twitterలో తెలిసిన వారి పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.