News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News October 29, 2025

అల్లూరి జిల్లాలో రేపు ప్రైమరీ పాఠశాలలకు సెలవు

image

మొంథా తుఫాను నేపథ్యంలో ఈనెల 30 గురువారం అల్లూరి జిల్లాలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు యథావిధిగా నడవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె కేజీ, కందిపప్పు కేజీ, ఉల్లిపాయలు కేజీ, బంగాళా దుంపలు కేజీ, పంచదార కేజీ అందిస్తున్నామన్నారు.

News October 29, 2025

వరంగల్: రైతులకు ముఖ్య గమనిక.. 4 రోజులు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. మొంథా తుఫాన్ కారణంగా గురు, శుక్రవారం ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరకులు తీసుకురావొద్దని, సోమవారం మార్కెట్ పున: ప్రారంభం అవుతుందన్నారు.

News October 29, 2025

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

image

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న పండించిన రైతులు దళారులకు తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు. జిల్లాలో 10,958 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని, ఇప్పటికే మొక్కజొన్న హార్వెస్టింగ్ ప్రారంభమైందన్నారు. కాబట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.