News February 12, 2025
శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 18, 2025
ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో AP టాప్: ADR

దేశవ్యాప్తంగా 4,092 మంది MLAలలో 1,861 మంది(45%)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వారిలో 1,205 మందిపై తీవ్రమైన కేసులు(మర్డర్, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు) ఉన్నట్లు తెలిపింది. ‘79% మంది(138/174) MLAలపై కేసులతో AP టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత కేరళ, TG(69%), బిహార్(66%), మహారాష్ట్ర(65%), TN(59%) ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లోనూ AP అగ్రస్థానంలో ఉంది’ అని పేర్కొంది.
News March 18, 2025
SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.
News March 18, 2025
WGL: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా అపర్ణ

వరంగల్ అబ్బనికుంట ప్రాంతానికి చెందిన రాసం అపర్ణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షల్లో జోన్- 4లో 38వ ర్యాంక్, మహిళా విభాగంలో 7వ ర్యాంక్ సాధించారు. తన భర్త సంతోష్, కుటుంబసభ్యుల సహకారంతో ఎలాంటి కోచింగ్ లేకుండానే ఉద్యోగం సాధించానని అపర్ణ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.