News September 11, 2024

శాలిగౌరారం: విషాదం.. ఆర్టీసీ కండక్టర్ మృతి

image

విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటుండగా ఆకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకొని ఆర్టీసీ కండక్టర్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల శివారులో జరిగింది. గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాశ్(50) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రక్తపువాంతులు చేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News October 14, 2024

నల్గొండ: ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

ఇందిరమ్మ కమిటీలను మంగళవారంలోగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ రోజు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఛైర్మన్‌గా, స్వయం సహాయక మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుంచి ముగ్గురు కన్వీనర్‌గా గ్రామపంచాయతీ కార్యదర్శితో గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

News October 14, 2024

NLG: ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రోల్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణకు సంబంధించి సమాచారం, ఫిర్యాదుల స్వీకరణకు ఉద్దేశించి కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌‌ను కలెక్టర్ నారాయణరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఏవైనా సమస్యలు తలెత్తిన 9963407064 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

News October 14, 2024

నడిగూడెం: పిడుగుపడి మహిళ మృతి

image

పిడుగుపడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన సోమవారం నడిగూడెంలో చోటుచేసుకుంది. బృందావనపురం గ్రామానికి చెందిన మామడి రమణ (22) గ్రామశివారులోని గట్టు మైసమ్మ వద్ద వ్యవసాయ పనులకు వచ్చింది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై మృతిచెందింది.