News February 14, 2025
శావల్యాపురంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

శావల్యాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గుంటూరు-కర్నూలు రహదారిపై సోసైటీ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
జక్కన్నపై దేవుడికి లేని కోపం మీకెందుకు: RGV

నాస్తికుడిగా ఉండటం నేరం కాదని రాజమౌళిపై విషం చిమ్మేవారు తెలుసుకోవాలని RGV పేర్కొన్నారు. ‘దేవుణ్ని నమ్మనివాడు ఆయనపై మూవీ తీయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్ మూవీ తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్స్టర్ అవ్వాలా? నిజమేంటంటే నమ్మని వ్యక్తికే దేవుడు వందరెట్లెక్కువ సక్సెస్ ఇచ్చాడు. అంటే దేవుడు మీ కంటే నాస్తికులనే ఎక్కువ ప్రేమిస్తుండాలి. మరి రాజమౌళితో దేవుడికిలేని ఇబ్బంది మీకెందుకు’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
రాష్ట్రంలో 32మంది IPSల బదిలీ

TG: పంచాయతీ ఎన్నికల వేళ 32మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADG పర్సనల్గా చౌహాన్, CID DIGగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ SPగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారే, వనపర్తి SPగా సునీత, మల్కాజ్గిరి DCPగా శ్రీధర్, ఆసిఫాబాద్ SPగా నిఖితా పంత్, TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో SPగా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


