News February 3, 2025

శావల్యాపురం: కాలువలో పడి తూ.గో జిల్లా యువకుడి మృతి

image

శావల్యాపురం మండలం ఘంటవారిపాలేం కాలువలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి రాజేశ్ (25)గా గుర్తించారు.   

Similar News

News January 9, 2026

గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.

News January 9, 2026

KNR: ‘ఉపాధి హామీకి కొత్త రూపం.. ‘వీబీ-జీ రామ్ జీ’గా బలోపేతం’

image

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.

News January 9, 2026

తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

image

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.