News February 3, 2025
శావల్యాపురం: కాలువలో పడి తూ.గో జిల్లా యువకుడి మృతి

శావల్యాపురం మండలం ఘంటవారిపాలేం కాలువలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి రాజేశ్ (25)గా గుర్తించారు.
Similar News
News February 9, 2026
KMR: ప్రధాన పార్టీల అగ్ర నాయకుల రాక లేమి!

ప్రచార పర్వం మొదల నుంచి ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు బారాస, భాజపా పార్టీ అగ్ర నేతలు ఎవ్వరు కూడా కామరెడ్డి మున్సిపాలిటీలో ప్రచారానికి రాలేదు. బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ లకు అన్ని పార్టీల అగ్రనేతలు వచ్చినప్పటికీ కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ మినహాయించి మిగతా పార్టీల అగ్ర నేతలు రాకపోవడం కొసమెరుపు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యతలు వారే తీసుకున్నట్లు అనిపిస్తోంది!
News February 9, 2026
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 9, 2026
ములుగు: ఈరోజు సాయంత్రం వైన్ షాపులకు తాళం..!

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వైన్ షాపులకు తాళాలు పడనున్నాయి. 11న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి తెరుచుకుంటాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం డంప్ చేసుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. 48 గంటలు షాపులు మూతపడుతుండటంతో మద్యం ప్రియులు అప్రమత్తం అవుతున్నారు. తాగేందుకు, పంచేందుకు అవసరమైన స్టాక్ కొనుగోళ్లు ఈరోజు భారీగా జరగనున్నాయి.


