News December 30, 2024
శావల్యాపురం: సైబర్ నేరగాళ్ల వలలో మండల నివాసి
శావల్యాపురం(M) కారుమంచికి చెందిన నరసింహారావు ఖాతాలోని నగదు మాయంపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. నరసింహరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిర్వహించుకొని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సైబర్ నేరగాడు నరసింహరావుకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు ఖాతాలో పడతాయని, మీకు వచ్చిన లింక్ ఓపెన్ చేయమన్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో డబ్బులు మాయయ్యాయి.
Similar News
News January 7, 2025
వృద్దులు, మహిళలకు ఫిర్యాదులపై శ్రద్ధ: ఎస్పీ
వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News January 6, 2025
8న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు: DEO
గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్‌లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు.
News January 6, 2025
గుంటూరు: 11 మందికి కారుణ్య నియామకాలు
కారుణ్య నియామకంలో భాగంగా వివిధ పోస్టులకు జిల్లాలో 11 మంది ఎంపికయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ నాగలక్ష్మీ అందించారు. ఇద్దరికి జైళ్ల శాఖ, ఇద్దరికి గ్రౌండ్ వాటర్, ఇద్దరికి పోలీస్ శాఖ, ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలలో జేఓఏలుగా నియమించారు. ఉద్యోగాలు పొందిన వారు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.