News November 21, 2024

శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం

image

శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.

Similar News

News December 12, 2024

ఏలూరు జిల్లాలో 354 నీటి సంఘాలు: కలెక్టర్

image

జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నెం.62 బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. జిల్లాలో 354 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని, వీటిలో 23 గోదావరి పడమర, కృష్ణా- తూర్పు నీటి కాలువ 54 సంఘాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ 15, తమ్మిలేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ 6 నీటి సంఘాలు, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువకు 5, మైనర్ ఇరిగేషన్ చెరువులకు 251 సంఘాలు ఉన్నాయన్నారు.

News December 11, 2024

కొవ్వూరు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

image

కొవ్వూరు శ్రీరామ కాలనీకి చెందిన నేతల వీరబాబు భార్య నేతల దేవి (21) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు భర్తకు ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్పగా చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చిన భర్తకు దేవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనబడుతుంది. స్థానికులు పోలీసులకు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News December 11, 2024

పనులు త్వరగా పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్

image

డిసెంబర్ 13న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా శాఖల వారీగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ మొత్తం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.