News September 12, 2024
శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి ఎన్నిక.. నేపథ్యం ఇదే

హనుమకొండ జిల్లాలోని నర్సక్కపల్లిలో 1956లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జన్మించారు. తొలిసారిగా 1994లో శాయంపేట నుండి టీడీపీ ఎమ్మెల్యేగా సిరికొండ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, కేసిఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మధుసూదనాచారి ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ ఎన్నికై తెలంగాణ తొలి స్పీకర్గా నియమితులయ్యారు.
Similar News
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.