News March 13, 2025
శాసనసభ్యుల క్రీడల పోటీలకు సిద్ధం చేయండి: కమిషనర్

శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడలో గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే శాసనసభ్యుల క్రీడల పోటీలకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 26, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు దక్కని ప్రాధాన్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు తక్కువ ప్రాధాన్యత దక్కింది. ఖమ్మం జిల్లాలో కేవలం 24 బీసీ (మహిళ) స్థానాలు దక్కగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 226 ఎస్టీ (మహిళ), 4 జనరల్ స్థానాలు కేటాయించారు. ఒకే మండలంలో ఇల్లెందులో 29 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 26, 2025
లోన్ ఇస్తామంటూ రాయదుర్గంలో ఘరానా మోసం

‘ఉషోదయ హోం ఫైనాన్స్’ సంస్థ నుంచి వచ్చామంటూ రూ.2 లక్షల లోన్ ఇస్తామని నమ్మించి రాయదుర్గంలో ఇద్దరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గ్యాస్ గోడౌన్, ముత్తరాసి, శనిమహాత్ముని కాలనీల్లో వందలాది మంది మహిళల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.3 వేలు వసూలు చేశారు. పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చి అక్కడి నుంచి ఉడాయించారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<


