News March 13, 2025

శాసనసభ్యుల క్రీడల పోటీలకు సిద్ధం చేయండి: కమిషనర్

image

శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడలో గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే శాసనసభ్యుల క్రీడల పోటీలకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 16, 2026

కామారెడ్డి: ఏసీబీ రైడ్స్‌.. ఆర్థిక లావాదేవీలపై అక్రమాల గుర్తింపు

image

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ రేంజ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాల తనిఖీలు నిర్వహించారు. 2025-26లో అనధికార నిర్మాణాల్లో 47 ఫిర్యాదులు వచ్చాయని, కోటి రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయని, ప్రాపర్టీ టాక్స్‌లో తేడాలున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 16, 2026

ఏలూరు: సబ్సిడీ సిలెండర్ల పట్టివేత

image

కామవరపుకోట మండలంలో వాణిజ్య అవసరాలకు గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడీ) సిలిండర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. శివ గాయత్రి హోటల్, తడికలపూడి, మణికంఠ భోజన హోటల్ కామవరపుకోటలో తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 7 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఆయన గుర్తించారు. వాటి విలువ రూ.19,806లు ఉంటుందని, యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.

News March 16, 2026

అమలాపురం: రూ.7 కోట్ల మోసం.. నిందితులకు జైలు శిక్ష

image

అమలాపురంలో సుమారు 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి మోసగించిన ఓ సంస్థ ఎండీకి 7 ఏళ్లు, డైరెక్టర్లకు 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి గందం సునీత తీర్పునిచ్చారు. నిందితులకు మొత్తం రూ.48.60 లక్షల జరిమానా విధించారు. పాత కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ అభినందించారు.