News November 11, 2024

శాసనసభ ప్రాంగణంలో పరిటాల సునీత, బండారు శ్రావణి

image

రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో వారు శాసనసభ ప్రాంగణంలో సహచర మహిళా ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.

Similar News

News December 9, 2024

బోరుగడ్డకు అనంతపురం పోలీసుల ప్రశ్నలు

image

అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తీసుకొచ్చిన పోలీసులు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో విచారిస్తున్నారు. సీఎం కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం 4గంటలకు కస్టడీ ముగియనుంది. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెడతారు.

News December 9, 2024

పెనుకొండలో ప్రతిభా పరీక్షకు 58 మంది గైర్హాజరు

image

పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ పరీక్షలను 4 కేంద్రాలలో నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. నాలుగు కేంద్రాలలో మొత్తం 968 మంది అభ్యర్థులకు గానూ 910 మంది పరీక్షలకు హాజరయ్యారు. 58 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు తెలిపారు.

News December 8, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.