News November 12, 2024
శాసనసభ విప్‌గా కురుపాం ఎమ్మెల్యే

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అసెంబ్లీ విప్‌గా నియమితులయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను శాసనసభ విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో జగదీశ్వరీకే విప్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కూటమి శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 22, 2025
జిల్లాలో కార్తీక శోభ కనిపించే ఆలయాలు ఇవే..!

కార్తీకమాసంలో ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసంలో ఏ ఆలయాల్లో చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జిల్లాలో రామతీర్థం రామస్వామి ఆలయం, విజయనగరంలో రామనారాయణ టెంపుల్, సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, పుణ్యగిరి శివాలయం, గోవిందపురంలోని సంతోషిమాత ఆలయం, గంట్లాంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటూ వస్తోంది.
News October 21, 2025
VZM: పండగ పేరిట పన్ను దోపిడీ?

విజయనగరం జిల్లాలో రెగ్యులర్ టాక్స్ పేయర్స్ అయిన పలువురు బాణసంచా వ్యాపారులు రికార్డుల్లో రూ.కోటి రిటర్న్ మాత్రమే చూపించి, రూ.4 కోట్ల టర్నోవర్‌ను దాచిపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లావాదేవీలు, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా GST స్వాహా చేస్తున్నారన్నారు. గోదాముల్లోని క్లోజింగ్ స్టాక్‌లో లక్షల విలువైన సరుకు లెక్కల్లో చూపడం లేదని, బోగస్ ITC క్లెయిమ్‌లు, E-Way బిల్ ఎగవేతలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
News October 21, 2025
నీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి: డ్వామా పీడీ

నీటి సంరక్షణ, నిల్వ చేసే పనులకు ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డ్వామా పీడీ శారద దేవి కోరారు. ఉపాధి హామీ పనులపై స్థానిక డిఆర్డిఏ సమావేశ మందిరంలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. 2026- 27 పనుల ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపు, గుర్తింపు, పనుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏపీడీలు, ఏపీవోలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.