News June 25, 2024
శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మంత్రి దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.


