News January 18, 2025
శాసనసభ స్థానాల్లో వైసీపీ పరిశీలకుల నియామకం

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు శాసనసభ స్థానాలకు పరిశీలకులను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గాజువాక సమన్వయకర్తగా దేవం రెడ్డి, భీమిలి సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, చోడవరం సమన్వయకర్తగా అమర్నాథ్, మాడుగుల సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడును అధిష్టానం నియమించింది.
Similar News
News December 5, 2025
విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు
News December 4, 2025
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.


