News February 27, 2025
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News November 5, 2025
GNT: తలచుకుంటే తల్లడిల్లే బీభత్సం..!

నేడు ప్రపంచ సునామీ దినోత్సవం. అయితే 2004 డిసెంబర్ 26న బంగాళాఖాతంలో వచ్చిన సునామీ ఆంధ్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర గ్రామాలు అతలాకుతమయ్యాయి. ఈ సునామీ వల్ల మొత్తం 301 గ్రామాలు నష్టపోగా, 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు నెలల పాటు కొనసాగాయి.
News November 5, 2025
‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.


