News June 4, 2024
శింగనమలలో బండారు శ్రావణిశ్రీ గెలుపు

శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. టీడీపీ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లింది. వైసీపీ అభ్యర్థిపై వీరాంజనేయులపై 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,159 ఓట్ల తేడాతో గెలుపొందారు. బండారు శ్రావణిశ్రీ 101223 ఓట్లు, వీరాంజనేయులుకు 93064 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
యాడికి: నిద్ర మాత్రలు మింగి యువకుడి సూసైడ్

యాడికి మండలం నగురూరుకు చెందిన శరత్ కుమార్(23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
News December 7, 2025
ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
News December 7, 2025
అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.


